అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్... ఒసాకాలో జీ20 సదస్సు జరుగుతున్న సందర్భంలో... వీళ్లిద్దరూ భేటీ అయ్యారు. ప్రత్యేకించి ఏ అంశంపైనా లోతుగా చర్చించకపోయినా, మర్యాదపూర్వకంగా ఇద్దరూ భేటీ అయ్యారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్యా వాణిజ్యపరమైన అంశాల్లో భేదాభిప్రాయాలున్నాయి. ఐతే... ఈ భేటీలో మాత్రం వాటిపై చర్చ జరగలేదని తెలుస్తోంది.