అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్లోని యింగ్కియాంగ్ నుంచి పసిఘాట్ వరకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 పై స్వారీ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ను నడిపాడు. పెమా ఖండు రాయల్ ఎన్ఫీల్డ్లో కనిపించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు తనకు బైకుల పట్ల ఇష్టం ఎక్కువని, కార్ల కంటే బైక్ ను ఇష్టపడతానని నిరూపించాడు. పెమా ఖండు తన సామజిక మాధ్యమాల్లో ఈ విషయాలను వెల్లడించారు.