బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు సైక్లింగ్ అంటే సరదా. ఆయనకు సమయం కుదిరినప్పుడల్లా ముంబయి వీధుల్లో సైక్లింగ్ చేస్తారు. ఆయన ఈసారి కూడా సైక్లింగ్ చేశారు. అయితే అది ముంబయిలో కాదు, అరుణాచల్ ప్రదేశ్లో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండూ, కేంద్ర సహాయమంత్రి కిరణ్ రిజీజుతో కలిసి చైనా సరిహద్దు దగ్గర సైక్లింగ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిన్న నిర్వహించిన సైక్లింగ్ రేస్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ఖాన్, గెలిచినవారికి బహుమతులు అందజేశారు.