హిమాలయాలకు వెళ్లేవారికి స్పిటీ వ్యాలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిటీ' అంటే 'మధ్య భూమి' అని అర్థం. హిమాచల్ ప్రదేశ్లో ఉందీ ప్రాంతం. చనిపోయేలోపు జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లిరావాలని అంటుంటారు. మరి అక్కడి ప్రత్యేకతలేంటో? స్పిటీ వ్యాలీకి వెళ్తే ఖచ్చితంగా చేయాల్సినవి ఏంటో తెలుసుకోండి.