పదోతరగతి హిందీని బాషా జ్ఞానంతో పాటు ఆలోచన శక్తిని పెంపోందించడానికి వీలుగా రూపోందించారు.అందుకోసమే హింధీ చదివేటప్పుడు ఖచ్చితమైన అవగాహాన తో చదివితే తప్పకుండ మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు అద్యాపకులు.
1. హిందీలో ప్రశ్నలన్ని ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. మొత్తం 75 మార్కులున్న పేపర్ ను తెలుగులో అర్దం చేసుకొని రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
2.హిందీ ఉపవాచకం నుంచి ఒక పేరాగ్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే హిందీ ఉపవాచకాన్ని బాగా ప్రీపేర్ అవడం మంచిది.
3.పదోతరగతి లో అన్ని సబ్జేక్ట్ లు 100 మార్కులకు ఉంటే హిందీ మాత్రమే 75 మార్కులకు ఉంటుంది. అందుకే ఉన్న తక్కువ మార్కులను కూడా సరైన ప్రణాళికతో సాధించగలిగితే ఓవరాల్ జీపీఏ పెరిగే అవకాశం ఉంటుంది.
4. దీంతోపాటు ఆధునిక పధ్యం నుంచి 5 లేదా 6 లైన్లు ఇచ్చి వాటిపై నాలుగు లేదు ఐదు ప్రశ్నలు అడుగుతారు ఆధునిక పధ్యాల్నింటిని అర్దం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది.
5.సంక్లీప్త ప్రశ్నలన్నింటి 50 పదాలు లోపు సమాధానలు రాస్తే మంచి మార్కులు వస్తాయి. దీంతోపాటు పద్యభాగం, గధ్యభాగం,ఉపవాచకం నుంచి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాటిని ప్రీపేర్ అవడం మంచిది.
స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.