పదోతరగతి పాఠ్యాంశాల్లో మరో కిలకమైన సబ్జెక్ట్ సోషల్. కాస్త మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకుంటే ఇందులో మంచి మార్క్ లు సాధించొచ్చు అంటున్నారు ఉపాధ్యాయులు. ముఖ్యంగా సోషల్ లో మంచి మార్కులు సాధించాలంటే రోజూ జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంశాల్లో మంచి అవగాహన పెంచుకోవాలని సోషల్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి తెలిపారు.