HOME » VIDEOS » Jobs

SSC 10th Exams: పరీక్ష సమయంలో ఒత్తిడిపోవాలంటే ఇలా చేయండి...

పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి చక్కటి ప్రణాళికను అవలంబించుకోవాలని అంటున్నారు డాక్టర్లు. మానసిక ఒత్తిడి దూరం చేసుకుంటే ఎలాంటి పరీక్షల్లోనైన మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి ప్రయత్నాలు కేవలం పరీక్షల సమయంలో చేయడం కాక, మొదటినుంచీ చేస్తే సత్ఫలితాలుంటాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి చిట్కాలు * మార్కుల కోసం కాకుండా సబ్జెక్టు మీద పట్టు కోసం చదవడం వలన మనం చదిన సబ్జెక్ట్ ఈజీ గా అర్ధమవుతుంది. ఇలా చేస్తే సబ్జెక్ట్ పై ఉన్న పట్టు తో ఎలాంటి ప్రశ్నాలు వచ్చిన ఈజీగా సమాధానం చెప్పొచ్చు అంటున్నారు. * తరగతిలో మనం ప్రవేశించిన రోజు నుంచే ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలు చదువుతూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. పరీక్షల సమయానికి సిలబస్ అంతా పేరుకుపోకుండా విధ్యార్ధలపై ఒత్తిడి లేకుండా ఉంటుంది. * చదివిన పాఠాల్లో ముఖ్యమైన అంశాలను బులెట్ పాయింట్లుగా నోట్ చేసుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు కాకుండా ప్రణాళిక ప్రకారం పునశ్చరణ చేసుకోవాలి. * నిర్వచనాలు, పట్టికలు, సూత్రాలు, రసాయనిక సమీకరణాలు, స్పెలింగులు క్షుణ్ణంగా చదివి గుర్తుపెట్టుకోవాలి. * దీంతోపాటు గత ఏడాది వచ్చిన పరీక్ష పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది వాటి సమాధానాలు కూడా రాయడం ప్రాక్టీస్ చేస్తే విద్యార్ధులకు పరీక్షలంటే భయం పోతుంది. * తగినంత విశ్రాంతి, నిద్ర, మంచి ఆహారం పరీక్షలకు ముందూ, పరీక్షల సమయంలోనూ అవసరం. రాత్రంతా మేలుకుని చదవటం మంచిది కాదు. ఎక్కవగా చదవడం కంటే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోని చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విశ్రాంతి సమయంలో టీవీలు చూడడం స్నేహితులతో మాట్లాడం ఫోన్లు వాడడం మంచిది కాదు. * స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

webtech_news18

Top Stories