హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : తృటిలో తప్పిన ప్రమాదం.. తల్లి అప్రమత్తతో చిన్నారి సేఫ్

అంతర్జాతీయం15:39 PM June 28, 2019

కొలంబియాలోని మెడలిన్‌లో రెప్ప పాటులో ఓ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. తల్లి అప్రమత్తంగా వ్యవహరించడంతో తృటిలో ఆ చిన్నారికి పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. లిఫ్ట్ ద్వారా నాలుగో అంతస్తుకు చేరుకున్న ఓ మహిళ.. బయటకొచ్చాక ఫోన్ మాట్లాడుతూ నిలుచోగా.. చిన్నపిల్లవాడైన ఆమె కొడుకు బాల్కనీ వైపు వెళ్లాడు. ఫోన్‌లో మాట్లాడుతూ ఆ మహిళ తన కొడుకు వైపు చూసేసరికి.. ప్రమాదవశాత్తు అతను బాల్కనీ నుంచి కిందపడిపోవడాన్ని గమనించింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయి..బాల్కనీ నుంచి పడిపోతున్న అతని కాలును పట్టుకుంది. అలా మెల్లిగా పైకి లాగడంతో ఆ చిన్నారి ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొడుకును కాపాడుకున్న ఆ తల్లిపై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదని, ఆమె అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే అతని ప్రాణాలతో బయటపడ్డాడని ఆ బిల్డింగ్ మేనేజర్ జువాన్ ఫ్రాంకో తెలిపాడు.

webtech_news18