హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సముద్రంలో వింత జీవి

అంతర్జాతీయం21:50 PM September 04, 2019

సముద్రంలో మనం ఎప్పుడూ చూడని జలచరాలు ఎన్నెన్నో. వింతగా కనిపించే ఎన్నో జలచరాలు అరుదుగా బయటపడుతుంటాయి. ఎప్పుడైనా అవి కెమెరా కంటికి చిక్కితే.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం ఖాయం. తాజాగా అలస్కాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపం వెంబడి ఉన్న సముద్ర తీరంలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. సారా వాసెర్ అల్‌ఫోర్డ్ అనే మహిళ ఆ వింత జీవి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చెట్టు మొదట్లో ఉండే వేర్ల లాగా.. ఈ వింత జీవి శరీరం కనిపిస్తోంది. అది కదిలినప్పుడల్లా దాని రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని పేరు బాస్కెట్ స్టార్ అని.. స్టార్ ఫిష్ జాతికి చెందినది అని అల్‌ఫోర్డ్ తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్రపు నీటిలో గాలం వేస్తుండగా.. బాస్కెట్ స్టార్ చిక్కిందని తెలిపింది. ఇది మనుషులకు ఎలాంటి హానీ చేయదని చెప్పింది. బాస్కెట్ స్టార్‌ను తిరిగి సముద్రంలోనే విడిచిపెట్టినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading