అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. అమెరికాలోని హూస్టన్‌లో జరుగుతున్న Howdy Modi మెగా ఈవెంట్లో ట్రంప్ ప్రసంగించారు. ‘త్వరలో భారత్ ఓ వరల్డ్ క్లాస్ ఎన్బీయే బాస్కెట్ బాల్ మ్యాచ్‌ను చూడబోతోంది. వావ్ ఇది వినడానికి చాలా బాగుంది. వచ్చే వారం ముంబైలో వేలాది మంది తొలిసారి ఎన్బీయే గేమ్‌ను ఆస్వాదించబోతున్నారు. నన్ను ఆహ్వానిస్తున్నారా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? నేను రావొచ్చా?, బీ కేర్ ఫుల్, నేను రావొచ్చు.’ అని అన్నారు.