ప్రధాని నరేంద్ర మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్తో సత్కరించింది. ఇరుదేశాల మధ్య మత, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో మోదీ చేసిన కృషికిగాను ఈ అవార్డును ఇస్తున్నట్టు గత ఏప్రిల్లోనే యూఏఈ ప్రకటించింది. ఈ అవార్డును యుఏఇ జాతిపిత షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరుతో ఇస్తారు.