హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ఈస్టర్ నాడు శ్రీలంకలో బాంబు పేలుళ్లు... 129 మంది మృతి... 350 మందికి గాయాలు

అంతర్జాతీయం12:09 PM April 21, 2019

క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాజధాని కొలంబో సహా... 6 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిపారు. ముఖ్యంగా కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో జరిగిన శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 129 మంది చనిపోగా... 350 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది. కోచికాడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై చాలా మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. చర్చిలో ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు... చెల్లా చెదురుగా పరుగులు తీశారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంకలో హైఅలర్ట్ ప్రకటించారు. పేలుళ్ల ప్రాంతాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద రాజపక్షే పరిశీలించారు. అత్యవసరంగా సమావేశమైన శ్రీలంక ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading