పాకిస్తాన్లో బబూసర్ ప్రాంతంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు మృతి చెందారు.మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం ఉదయం స్కర్దు నుంచి రావల్పిండి వెళ్తున్న బస్సు బబూసర్ ప్రాంతంలో అదుపు తప్పి ఓ పర్వతాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.