హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కరోనా వైరస్ కలవరం పై..ప్రపంచ ఆరోగ్యసంస్థ కమిటీ అత్యవసర భేటీ

అంతర్జాతీయం10:15 AM January 23, 2020

చైనాతోపాటు జపాన్, కొరియా, థాయ్‌లాండ్, అమెరికా దేశాల్లో కొత్త రకం ‘కరోనా వైరస్’ సోకడం వల్ల 17 మంది మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర కమిటీ సమావేశమై ఆ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ నాలుగు దేశాలకు పాకిందని అందిన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్ధితులు నెలకొన్నందు వల్ల దీనిపై ఏం చేయాలనేది గురువారం తమ అత్యవసర కమిటీ నిర్ణయిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading