హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. మంటల్లో చిక్కుకున్న పర్యాటకులు

అంతర్జాతీయం19:00 PM January 01, 2020

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అంటుకుంది. దీంతో ఆగ్నేయ ప్రాంతంలో అడవులు కాలిపోయాయి. అయితే నూతన సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు తరలివచ్చిన పర్యాటకులు మంటల తాకిడికి సమీపంలోని బీచ్‌లకు పారిపోవాల్సి వచ్చింది. న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో సమీపంలోని బీచ్‌లకు దాదాపు 4 వేల మంది పారిపోయి వచ్చారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్‌ బాంబ్‌లను ఉపయోగిస్తున్నట్లు న్యూసౌత్‌ వేల్స్‌ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం తెలిపింది. అధికారులు మాట్లాడుతూ ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు.

webtech_news18