లంబోలో మరిన్ని పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రచేసినట్లు తెలుస్తోంది. లారీతో పాటు మరో కారులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను తరించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో లంక పోలీసులు అప్రమత్తమయ్యారు. కొలంబోలోని అన్ని పోలీస్ స్టేషన్‌లను ప్రభుత్వం హైఅలర్ట్ చేసింది. కొలంబో వైపుగా ట్రక్కు, కారు వెళ్లాయని సమాచారం అందించడంతో పోలీస్ బృందాలు వాటి కోసం గాలిస్తున్నాయి. కొలంబో చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెనీ జల్లెడ పడుతున్నాయి. హైవేలపై పికెటింగ్ ఏర్పాటుచేసిన ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.