Germany Firing : జర్మనీలోని హనావ్ నగరం ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొందరు దుండగులు రెండు వేర్వేరు చోట్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 8 మంది చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు. జర్మనీ టైమ్ ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల తర్వాత దుండగులు ఓ హుక్కా బార్ దగ్గర గన్స్ బయటకు తీశారు. వాటిలో బుల్లెట్లన్నీ అయిపోవాలి అన్నట్లుగా వరుసపెట్టి కాల్పులు జరిపారు. అక్కడున్న జనం తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. బుల్లెట్లు దూసుకెళ్లిన వాళ్లలో ముగ్గురు... అక్కడికక్కడే పడి స్పాట్లోనే చనిపోయారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు తర్వాత దుండగులు... అక్కడి నుంచీ కారులో పారిపోయారు. ఐతే... కొందరి గన్స్లో కొన్ని బుల్లెట్లు మిగిలాయి. వాటిని కారులో మోసుకెళ్లడం ఎందుకనుకున్నారో ఏమోగానీ... వేరే ప్రాంతంలోకి హుక్కా బార్కి వెళ్లి అక్కడ కూడా కాల్పులు జరిపారు. అక్కడ మరో ఐదుగుగుర చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం దుండగుల కోసం వేట కొనసాగుతోంది.