అమెరికాలోని కనెక్టికట్‌లో విమాన ప్రమాదం జరిగింది. బ్రాడ్లీ ఎయిర్‌పోర్టులో 80 ఏళ్ల నాటి యుద్ధం విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు సహా మొత్తం ఏడుగురు చనిపోయారు. ఈ B-17 బాంబర్ విమానం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొందని అమెరికా అధికారులు తెలిపారు.