Article 370 Effect | Samjhauta Express | భారత్, పాక్ దేశాల మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్.. అట్టారీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. వాఘా బోర్డర్‌కు చేరుకున్న ఈ రైలులో పాక్ డ్రైవర్, సిబ్బంది భారత్‌కు రావడానికి నిరాకరించారు. దీంతో రైలును భారత్‌కు తీసుకురావడానికి మన దేశానికి చెందిన లోకోపైలట్, సిబ్బంది వెళ్లి రైలును అట్టారీ రైల్వే స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు.