Hong Kong: ప్రస్తుతం హాంకాంగ్..అందోళనలతో అట్టుడుకుతోంది. నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఓ బిల్లును చైనా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్షలాదిమంది ఆదివారం హాంకాంగ్ వీధుల్లో నిరసన చేపట్టారు. అయితే అంతటి అందోళనలో ఓ అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. వేల కొద్ది మంది నిరసనకారులు రోడ్లపై నిల్చోన్నారు. ఇంతలో ఓ అంబులెన్స్ అలా రోడ్డుపై వస్తుండగా.. క్షణాల్లో దారి ఇచ్చి అబ్బురపరిచారు. ప్రాణం విలువను చాటిచెప్పారు.