వాటికన్ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ మహిళ భక్తురాలు ఆయన చేయిని గట్టిగా లాగింది. సహనం కోల్పోయిన పోప్ ఫ్రాన్సిస్.. ఆ మహిళ చేతిపై కొట్టారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్లో నేటివిటి స్కీన్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది. పోప్ ఫ్రాన్సిస్ తీరుపై విమర్శలు రావడంతో.. ఎట్టకేలకు ఆయన క్షమాపణలు తెలిపారు.