దక్షిణ అమెరికా దేశం పెరూలో... చాకొలెట్స్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే ఏటా అక్కడ చాకొలెట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 600 రకాల చాకొలెట్స్ను అక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. వరుసగా 10వ సంవత్సరం జరుగుతున్న ఫెస్టివల్‌కి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. రకరకాల చాకొలెట్స్‌ని టేస్ట్ చూస్తున్నారు.