హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ఇరాక్‌లో పడవ బోల్తా.. 100 మంది మృతి..

అంతర్జాతీయం12:23 PM March 22, 2019

ఇరాక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మోసుల్ నగరంలోని టైగ్రిస్ నదిలో పడవ మునిగి దాదాపు 100మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 19 మంది చిన్నారులు, 61 మంది మహిళలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కుర్దిష్ న్యూ ఇయర్‌గా జరుపుకునే నౌరుజ్ పండుగ నేపథ్యంలో 200 మంది పర్యాటకులు ఓ పడవలో నదికి ఆవలి వైపు ఉన్న ఉమ్ రుబేయిన్ ద్వీపానికి బయలుదేరగా.. ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునిగిపోయింది. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్‌దీ దీనిపై విచారణకు ఆదేశించారు. టైగ్రిస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటం.. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మోసుల్ డ్యామ్ గేట్లు తెరవడంతో.. నదిలో ఉధృతి పెరిగిందని.. ఇలాంటి సందర్భంలో పడవ నడపడం ప్రమాదమని తెలిసినా.. ప్రవాహానికి ఎదురెళ్లడం ప్రమాదానికి కారణమైందని మరికొందరు చెబుతున్నారు.

webtech_news18