హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : నెదర్లాండ్‌లో కాల్పులు : ట్రామ్ రైల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు

అంతర్జాతీయం11:58 AM March 19, 2019

Netherlands Shooting : నెదర్లాండ్‌లోని ఉత్రెచ్ట్ నగరంలో కాల్పుల కలకలం రేగింది. స్థానిక ట్రామ్ రైల్లో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు ఓ కారులో అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఉగ్రవాద కోణంలోనే జరిగిందా..? లేక సాధారణ పౌరుడే కాల్పులకు పాల్పడ్డాడా..? అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో మసీదులపై జరిగిన కాల్పుల్లో 40 మందికి పైగా మృతి చెందడంతో.. నెదర్లాండ్ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. నెదర్లాండ్ యాంటీ టెర్రరిస్ట్ కోఆర్డినేటర్ వెంటనే అధికారులను సమావేశపరిచి ఘటనపై చర్చించారు. కాల్పుల ఘటనపై ప్రధాని మార్క్ రుట్టె విచారం వ్యక్తం చేశారు.

Krishna Kumar N