HOME » VIDEOS » International

Video : ఇరాన్ క్షిపణి దాడుల్లో ఎవరూ చనిపోలేదు.. ట్రంప్ ప్రకటన

అంతర్జాతీయం22:47 PM January 08, 2020

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.  ఇరాన్ దాడిలో ఏ ఒక్క అమెరికన్‌కూ గాయాలు కాలేదని తెలిపారు. తక్కువ నష్టం మాత్రమే జరిగిందని.. అమెరికన్ జవాన్లంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించారు.   తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇరాన్‌కు అణ్వాయుధాలు చిక్కనీయనని స్పష్టం చేశారు. అమెరికా ఎంతో శక్తివంతమైన హైపర్ సోనిక్ మిసైల్స్‌ని తయారు చేస్తోందని.. తమ సైన్యం ఎంతో బలమైదన్నారు ట్రంప్. తమ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఆ అవసరం రాకూడదనే కోరుకుంటున్నట్లు పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ క్షిపణి దాడులపై వైట్ హౌస్‌లో 10 నిమిషాల పాటు మాట్లాడారు ట్రంప్.

webtech_news18

Top Stories