Trump India Visit : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ అమెరికాకు ఇండియా సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు చేస్తూనే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీతో స్నేహాన్ని ప్రస్తావిస్తూ.. మోతేరా స్టేడియంలో తనకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని మోదీ చెప్పినట్లు మరోసారి స్పష్టం చేశారు.