హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్...చిక్కుల్లో పడ్డారు. లొకేషన్ మేనేజర్‌పై దాడి చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. సెట్స్‌లో జానీ డెప్ తనను దూషించడంతో పాటు, భౌతికంగా దాడి చేశాడంటూ దావా వేశాడు లొకేషన్ మేనేజర్ గ్రెగె బ్రూక్స్. గత ఏడాది ఏప్రిల్ లో లాస్ ఏంజెల్స్ లోని బార్ క్లే హోటెల్లో షూటింగ్ జరుగుతుండగా జరిగిందీ ఘటన అని తేల్చాడు.