Houston Rain : అమెరికా... టెక్సాస్‌లో... భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా... రేపు నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ... టెక్సాస్‌లోని హోస్టన్‌లో పర్యటించనుండగా... ఇవాళ అక్కడ వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించేంత పరిస్థితి వచ్చేసింది. మరి హోస్టన్‌లో 22న చరిత్రాత్మక సదస్సు జరగనుంది. దానికి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 50 వేల మంది ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలూ రాబోతున్నారు. అంత పెద్ద సదస్సు జరుగుతుండగా... ఈ వరదలు రావడం సమస్యగా మారింది. టెక్సాస్ గవర్నర్ రాష్ట్రంలోని 13 కౌంటీల్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. గురువారం టెక్సాస్‌లోని చాలా చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. ఫలితంగా ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. చాలా చోట్ల కరెంటు సరఫరా లేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐతే... NRG స్టేడియంలో హౌడీ-మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు 1500 మంది వాలంటీర్లు అదే పనిగా శ్రమిస్తున్నారు. ఆదివారం కార్యక్రమం విజయవంతం అవుతుందని వారు నమ్మకంతో ఉన్నారు.