హైతీ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు మళ్లీ పెచ్చరిల్లాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోయిస్ దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కారులు ఆందోళన బాట పట్టారు. అయితే, ఈ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.