తెలంగాణ నుంచి పొట్టచేతబట్టుకుని ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వలసవెళ్లారు. నకిలీ ఏజెంట్ల చేసిన మోసంతో ఇప్పుడు.. చాలా మంది ఆయా దేశాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక.. అవస్థలు పడుతున్నారు. తమను ఆదుకోండంటూ.. నిజామబాద్ జిల్లాకు చెందిన కొందరు గల్ఫ్ బాధితులు.. తమ కష్టాలను వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.