HOME » VIDEOS » International

Video: పోలీసులు పట్టుకునే లోపే పేల్చుకున్న ఉగ్రవాది...సీసీ కెమెరాలో దృశ్యాలు

అంతర్జాతీయం18:04 PM February 19, 2019

ఈజిప్ట్‌లో ఓ సూసైడ్ బాంబర్ బీభత్సం సృష్టించాడు. పోలీసులు పట్టుకునే లోపే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బందితో పాటు ఉగ్రవాది చనిపోయాడు. కైరోలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది వెళ్లారు. ఆ విషయం తెలిసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఉగ్రవాది. ఇరుకైన గల్లీలో బైక్‌పై పారిపోవాలని చూశాడు. కానీ వెనకాలే ఉన్న పోలీసులు అతన్ని వెంబడించారు. ఐతే పట్టుకునే క్రమంలోనే రిమోట్ నొక్కి పేల్చుకున్నాడు టెర్రరిస్ట్. సీసీ టీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

webtech_news18

Top Stories