అమెరికాలోని కాలిఫొర్నియా స్టేట్లో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్న విమానం అదుపుతప్పి ఇళ్లపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. లాస్ఏంజ్లెస్ శివారులోని యోబ్రా లిండాలో ఈ ప్రమాదం జరిగింది. క్రాష్ అయిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.