హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. 20 మంది మృతి, మరో 40 మందికి గాయాలు..

అంతర్జాతీయం12:50 PM August 04, 2019

El Paso shooting : అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అర్ధరాత్రి అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు తెగబడిన వారిలో ముగ్గుర్ని పోలీసుల అదుపులో తీసుకున్నారని.. ఎల్‌పాసో మేయర్‌ డీ మార్గో తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువుగా హిస్పానిక్‌ వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గతవారం అమెరికాలోని కాలిఫోర్నియాలోని గార్లిక్ ఫెస్టివల్‌లో కూడా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading