అమెరికాలో జరిగిందీ ఘటన. హైవేపై వేగంగా కార్లు వస్తున్న సమయంలో... ఓ కుక్క రోడ్డు దాటబోయింది. ఓ కారును ఢీకొట్టి... గాయాలపాలై... రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది. అది చూసిన ఓ పోలీస్ ఆఫీసర్... దాన్ని కాపాడాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు. ఇప్పుడా కుక్క సంతోషంగా ఉంది. గాయం నుంచీ కోలుకొని... మరు జన్మను పొందింది. ఆ పోలీస్ ఆఫీసర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.