హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..ఓ విద్యార్థి మృతి,ఎనిమిది మందికి తీవ్రగాయాలు

అంతర్జాతీయం14:44 PM May 08, 2019

అమెరికాలోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఇద్దరు దుండగులు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డారు. అ ఘటనలో ఓ విద్యార్థి మ‌ృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లో ఇద్దరు దుండగలు పాఠశాలలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఓ దవాఖానకు తరలించారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు చోటుచేసుకుంది.  

webtech_news18