హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్‌... హగ్ ఇచ్చిన డాగ్

అంతర్జాతీయం05:47 PM IST Mar 06, 2019

చిలీలో ఆపదలో ఉన్న ఓ శునకాన్ని కాపాడిన పోలీస్ ఆఫీసర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంటిపైన ఓ వస్త్రం చివర్లో ఉన్న తాడు శునకాన్ని చుట్టేసింది. అందులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో శునకం చిక్కుపోయింది. ఆ తాడును తొలగించేందుకు శునకం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కడుపును తాడు చుట్టేయడంతో విలవిల్లాడింది. అటువైపు వెళ్తున్న ఓ పోలీస్ ఆఫీసర్ ఆ దృశ్యాన్ని చూశాడు. కంచె పైనుంచి దూకి వెళ్లి శునకాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. తనకు హాని తలపెడుతున్నాడని భావించిన శునకం మొదట ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ పోలీస్ ఆఫీసర్ వస్త్రాన్ని కత్తిరించి శునకాన్ని విడిపించాడు. దీంతో ఆ డాగ్ కృతజ్ఞతతో హగ్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

webtech_news18