హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

రాయలసీమ అమ్మాయి, అమెరికా అబ్బాయి..పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రేమ జంట

అంతర్జాతీయం03:57 PM IST May 10, 2019

దేశాలు వేరు, భాషలు వేరు, పెరిగిన వాతావరణం వేరు... కానీ, అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి ఇవి అడ్డుగోడలుగా నిలవలేదు. యువ జంట నాలుగేళ్ల పాటు కలసి చదువుకొని ప్రేమలో పడి పెద్దపను ఒప్పించి... ఖండాంతరాల దాటి వచ్చి చిత్తూరులో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన సుధాకర్ నాయుడు, కమల కుమార్తె నిషా, 2013లో బిటెక్ పూర్తి చేసుకున్న నిషా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో ఎంటెక్ కోసం వెళ్ళింది. యూనివర్సిటీలో తనతో పాటే చదువుకుంటున్న ఆండ్రూ గ్రీనరీతో ప్రేమలో పడింది. తన ప్రేమ విషయం చెప్పి.. తల్లిదండ్రులను ఒప్పించింది. అండ్రూ పేరెంట్స్ కూడా ఈ పెళ్లికి ఓకే అనడంతో.. గురువారం చిత్తూరులోని ఒక హోటల్లో హిందూ సంప్రదాయంలో అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ఒక్కటి అయ్యారు.

webtech_news18