అమెరికా... ఒహియోలోని సిన్సినాటీ జూలో కనిపించిందీ దృశ్యం. బద్ధశత్రువుల్లా ఉండే చిరుత, కుక్క కలిసి మెలిసి ఉన్నాయి. జాతి వైరాన్ని పక్కన పెట్టి... చక్కగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ కుక్క కోజీని ఓ సందర్భంలో జూ అధికారులు కాపాడారు. ఇప్పుడా కుక్కతో కలిసి చిరుతపులి పిల్ల ఆడుకుంటోంది.