సోమాలియా రాజధాని మొగాడిషు బాంబుల మోతతో దద్ధరిల్లింది. బాంబు దాడితో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఓ ప్రభుత్వ కార్యాలయం ఎదుట కారులో బాంబులు నింపి పేల్చివేశారు.
ఈ ఉగ్రదాడి ఘటనలో తొమ్మిది మంది పౌరులు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. దాడికా పాల్పిడింది తామేనని ఆల్ షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.