ఇరాక్‌లో శుక్రవారం అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో మృతిచెందిన ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో పెను విషాదం చోటుచేసుకుంది. సులేమానీ మృతదేహాన్ని మంగళవారం తన స్వస్థలమైన కెర్మాన్‌కు తీసుకొచ్చారు. సులేమానీ అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది తరలి రాగా..తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతిచెందినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు.. మరో 190 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.