పాకిస్తాన్లో మరోసారి రక్తపు టేరులు పారాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెటా బాంబుల మోతతో దద్ధరిల్లింది. ఓ కూరగాయల మార్కెట్లో బాంబులు పేలడంతో 20 మంది చనిపోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి.