కశ్మీర్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు లోయలో మౌలిక సదుపాయాల కల్పన పనులను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా చీనాబ్ నదిపై రూ.1,486 కోట్ల వ్యయంతో రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జి కనీసం వందేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.