నల్గొండ పట్టణంలోని అర్జాల బావిలో నివాసం ఉండే ఓ వివాహిత పట్ల అదే ప్రాంతానికి చెందిన శ్రీశైలం అనే యువకుడు కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. తరుచూ ఆమె ఇంటి చుట్టూ సంచరించడం..ఇంట్లోకి తొంగి చూడటం చూస్తుండేవాడు. ఇంటి ముందు నుంచి వెళ్తూ అసభ్యకరంగా సైగలు చేసేవాడు. అతని చేష్టలు శృతిమించడంతో భర్తతో విషయం చెప్పింది. గురువారం శ్రీశైలం తమ ఇంటి వద్దకు రాగానే.. భార్యాభర్తలు అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు.