ఫుట్ బోర్డ్ ప్రయాణం ప్రమాదకరమని బస్సుల్లో, రైళ్లల్లో పోస్టర్లు కనిపిస్తూనే ఉంటాయి. అయినా వినకుండా యువకులు ఫుట్‌బోర్డ్‌పై విన్యాసాలు చేస్తుంటారు. ఇలాగే ముంబైకి చెందిన దిల్షాన్ అనే యువకుడు రైలులో ఫుట్‌బోర్డ్‌పై విన్యాసాలు చేశాడు. ఆ స్టంట్‌ను లోపల ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ ప్రమాదకరమైన విన్యాసం చివరకు ఆ యువకుడి ప్రాణం తీసింది. రైలు పట్టాల పక్కన ఉన్న స్తంభానికి ఢీకొనడంతో దిల్షాన్ ప్రాణాలు వదిలాడు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో వీడియో చూడండి.