భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ లో దారుణం చోటుచేసుకుంది. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన గుగులోత్ శిరీష తన భర్త గుగులోత్ కృష్ణ అశ్వరావుపేట లో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తతో గొడవపడి అశ్వరావుపేట నుండి పిల్లలతో పాల్వంచ బస్ స్టాండ్ కు చేరుకుని తన ఇద్దరు పిల్లలు కుస్మంత్, భిస్మంత్ లకు పురుగుల మందు ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. చిన్న కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.