హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఏపీలో కాలేజీ బిల్డింగ్‌‌పై నుంచి దూకబోయిన యువతి..

ఆంధ్రప్రదేశ్17:53 PM August 23, 2019

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నించింది. వెంటనే ఆమెను కాలేజీ సిబ్బంది ఒకరు వెనక్కి లాగి కాపాడారు. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న శివ.. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిలుకూరుకు చెందిన అనసూయను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ మధ్య వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, గురువారం ఆమె కాలేజీకి వచ్చి భర్తను చూడాలని కోరగా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఆమె దూకబోతుండగా వెనుక నుంచి వచ్చిన కాలేజీ సిబ్బంది ఒకరు వెంటనే ఆమెను వెనక్కి లాగాడు.

Shravan Kumar Bommakanti