HOME » VIDEOS » Crime

Video : తెలంగాణలో మరో దిశ ఘటన.. యువతిపై అత్యాచారం, హత్య..

క్రైమ్11:43 AM March 17, 2020

తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. దిశ ఘటనను తలపించేలా.. యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఈ దారుణం జరిగింది. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడం, తలపై బండరాయితో మోది ఉండటం.. అచ్చంగా దిశ ఘటనను తలపించింది. వివరాల్లోకెళితే.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆధారాల కోసం స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

webtech_news18

Top Stories