లోన్ కోసం బ్యాంకుకు వస్తే, తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించిన బ్యాంకు మేనేజర్‌కి రోడ్డు మీద చిత్తకొట్టి, బుద్ది చెప్పిందో మహిళ. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లోన్ కోసం బ్యాంకుకి వెళితే, తన కోరిక తీరిస్తేనే లోన్ మంజూరు చేస్తానంటూ వెకిలి వేషాలు వేసిన బ్యాంకు మేనేజర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి, కర్రతో చితకబాదింది సదరు మహిళ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.