హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మహిళను చితకబాదిన భార్య... తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని...

క్రైమ్12:07 PM July 25, 2019

కూకట్‌పల్లిలో జరిగిందీ ఘటన. కట్టుకున్న భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా... మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహించిన ఆ మహిళ... వాళ్లిద్దర్నీ చితకబాదింది. కొత్త కొమ్ముగూడెం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌కూ సౌజన్యకూ పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల భార్యను వదిలిపెట్టిన లక్ష్మణ్... తరచుగా కూకట్‌పల్లికి వెళ్తున్నాడు. అక్కడి ప్రగతినగర్లో మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె... తనకు అన్యాయం చెయ్యవద్దని కోరింది. అయినా లక్ష్మణ్ పట్టించుకోలేదు. అలాగైతే... తనకు విడాకులు ఇచ్చేయమని కోరింది. అయినప్పటికీ విడాకులు ఇవ్వకుండా నాటకాలు ఆడసాగాడు. ఈ మధ్య పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. ఇలాంటి భర్తను ఊరికే వదిలెయ్యకూడదని భావించిన ఆమె... బంధువులతో కలిసి... తిన్నగా ప్రగతి నగర్ వెళ్లి... అతన్ని, ఆమెనూ చితకబాదింది. తర్వాత ఇద్దర్నీ పోలీసులకు అప్పగించింది.

Krishna Kumar N