ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో... ఓ మహిళ బ్యాంక్ పని చూసుకొని... ఇంటికి వెళ్తుంటే వెనకాలే ఫాలో అయ్యాడు ఓ కుర్రాడు. విజిల్స్ వేస్తూ... గోల చేయడం ప్రారంభించాడు. చాలాసేపు ఓపిక పట్టిన ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఏంట్రా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్... అంటూ చెప్పు తీసి... చెడా మడా వాయించింది. అప్పటికే చుట్టూ జనం చేరారు. వాళ్లు అదీ లెక్క అలా గడ్డి పెట్టండి అంటూ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఆ తర్వాత చెప్పు పాడైపోతుందంటూ ఆమెను ఆగమని చెప్పి... వాళ్లంతా తలో కాలూ వేసి... ఆ గాలోడికి బుద్ధి చెప్పారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.